Pages

మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం



మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం







మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం

సెప్టెంబర్ 29- అక్టోబర్ 5, 2013 
వేదిక: శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడ్ పల్లి, హైదరాబాద్ 
నిర్వాహకులు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా-సౌజన్యం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ













సాహితీ ప్రసంగంలో ద్వానా రికార్డు

తెలుగు భాషా సాహిత్యాలపై 12 గంటలపాటు నిర్విరామ ప్రసంగధార


ఏకధాటిగ 12 గంటల ప్రసంగం.. 
 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియ బుక్ ఆఫ్ రికార్డ్స్


తెలుగు సాహిత్య చరిత్ర (Telugu Saahitya Charitra) By Dwana Sastry


నన్నయ్య నుంచి నేటి వరకు ప్రాచీన ఆధునిక సాహిత్యాలను వివరించే పుస్తకమిది. నేటి సాహిత్య ధోరణలు, వాదాలతోపాటు ఆధునిక కవితా రుపాలను కూడా విశ్లేషించారు. 808 పుటలగల ఈ పుస్తకం ఇప్పటికి ఆరు ముద్రణలు పొందింది. తెలుగు సాహిత్యం పై పట్టు సాధించడానికి ఉపకరిస్తుంది  -ద్వా.నా శాస్త్రి

సామెతలు-జాతీయాలు (SAMETALU JATEEYALU)


తెలుగు భాషా సంపదకు జాతీయాలు ,సామెతలు ఎంతగా తోడ్పడుతాయొ ఉదాహరణలతో విశ్లేషించిన ఈ పుస్తకం చంద్రాడికోనూలు పోగు వంటిది.
 - ద్వా.నా శాస్త్రి

Dwana Sastry's Unique book ‘Ma Nannagaru' released


April 21,2010:
A unique piece of work in Telugu literature ‘Ma Naannagaru', a collection of what sons or daughters spoke of their fathers who were all great writers and men of letters, was released here on Tuesday by noted writer Kalipatnam Ramarao. Speaking on the occasion, the author of the book Dwanasastry all the 62 writers, who found place in the book had passed away which was why their wards were able to write more freely about their fathers. The book would throw light on the literature about 70 years ago and also the life led by the writers which was unknown to the world. “Quite a few works and poems had come on Amma or mother but nothing on father that's why I chose the subject. The response to the book is tremendous and already 300 copies were sold out. The book also would serve as a lesson in personality development,” he said. He also narrated the difficulties in making the wards write or in collecting information from them. Noted writer Dondapati Devadasu said Dwanasastry's concern for society was reflected in the book in which details hitherto unknown of great authors of yesteryears were made known. The book could serve as a reference book to all, he opined. President of organisers Sneha Sandhya, KJR Sarma chaired the meeting in which its joint secretary R.V. Gopala Rao, and wards of writers K. Malayavasini (daughter of Andra Seshagirirao), Rachakonda Uma Kumara Sastry (son of Raavi Sastry), Madhunamurthy (son of Madhunapaantula Satyanarayana Sastry), Prabhakara Sarma (son of Bulusu Venkataramanaiah) and others spoke. 

Source: The Hindu

Dr. Dwana Shastry Literary award - 2011 awarded to Dr.G.PRABHAKAR


Dr. G. Prabhakar have been awarded “ Dr. Dwana Shastry Literary award-2011” Instituted by the Hyderabad based famous and 40 years old Literary House called ‘Kinnera Art Theatres (A literary, Cultural, Social Organization)’ for him contribution to the development of Telugu language and Literature on 15.06.2011, on the occasion of Dr. Dwana Shastry’s 64th Birthday at Thayagarayagana Saba, Chikkadapalli, Hyderabad. The Award was presented by Former Chief Minister of Andhra Pradesh K.Sri Rosaiah, and Sri Mandali Budda Prasad, Former Minister, Govt. of Andhra Pradesh. The Authorities have selected five Eminent Telugu Scholars belonging to different states and fields. He is one among them in the field of Language and Literature.

తెలుగు సాహిత్యంలో హాస్యామృతం


స్మితం, హసితం ఉత్తమమైన నవ్వులు. విహసితం, ఉపహసితం మధ్యమమైనవి. అపహసితం, అతిహసితం అధమమైనవి- అని చెప్పారు. తిక్కన నవ్వుగాని నవ్వు, సెలవి వార నవ్వు, పెద్ద నవ్వు... అంటూ చాలా నవ్వులు పేర్కొన్నాడు. ఆచార్య రవ్వా శ్రీహరి అన్నమయ్య కీర్తనలలో వందకు పైగా నవ్వులున్నాయన్నారు. 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావు నవ్వు గురించి పరిశోధన చేసి చెప్పిన పలుకులివి- ''నవ్వేటప్పుడు ముఖం వికసించం- కళ్ళు పెద్దవి అవడం, లేకపోతే సగం అవడం, కనుబొమలు పైకి జరగం, దవడలు లేవడం, ఎడం అవడం, తలటెక్కింపు, ఝాడింపు, దంత దర్శనం, ఒక వేళ పళ్ళు పొడుగ్గా ఉంటే అప్పుడు వాటిని ఆచ్చాదన చెయ్యడం, ఇముడని కట్టు పళ్ళైతే వాటిని తీసి చేత్తో పుచ్చుకోవడం, భుజాలు ఎగరెయ్యడం, మెలికలు తిరగడం, దుంప తెగిపోనూ మొదలైన మాటలతో తిట్టుకేకలు, కూతలు, అరుపులు, చప్పట్లు, బాదులు ప్రక్క వాళ్ళని దిగిదోవడం, కళ్ళ నీళ్ళు తుడుచుకోవడం, పొట్ట నొప్పి తమాయించనికి అబ్బ! అబ్బ! ఉండు, ఉండు అంటూ తెమలకుండా మాట్లాడడం వంటివి నవ్వే సమయంలో కనిపిస్తాయి''. నవ్వుల్లో కుక్క కూత నవ్వులు, కప్ప బెక బెకల నవ్వులు, గుఱ్ఱపు సకిలింపు నవ్వులు, 'గ్యాస్‌' నవ్వులు, రైలింజను నవ్వులు, దగ్గు నవ్వులు ''కంటిన్యూ'' నవ్వులు, మాయలపకీరు నవ్వులు ఏడిపించే నవ్వులు, ఆమోదం తెలిపే నవ్వులు, నిరసన నవ్వులు, వేదాంతపు నవ్వులు... ఇలా ఎన్ని ఉన్నాయో!! ఒక్కొక్కసారి ఇతర రసాల వల్ల కూడ హాస్యం వస్తుంది. దీనినే రసాభాస అంటారు. భారతంలో ఉత్తర కుమారుడు చూపించే వీర రసాభాస నవ్వు తెప్పిస్తుంది. ''ఇప్పుడు నేను మిమ్మల్ని నవ్విస్తాను'' అంటూ మాట్లాడినపుడు మనకి నవ్వు రానప్పుడు... అతన్ని చూసి నవ్వుకుంటాం. హాస్యం దివ్యౌషధం అంటారు. మనసారా నవ్వగల వాడే మనిషి అన్నారు. Laughter makes good blood అనటమూ వుంది. - డా.ద్వా.నా శాస్త్రి

డాక్టర్ ద్వానాశాస్త్రికి గారికి రాగరాగిణి కళానిధి బిరుదు ప్రధానోత్సవం


రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్, త్యాగరాయగానసభల సంయుక్త అధ్వర్యంలో జరిగిన 'తెలుగు వెలుగు' పోటీ పరీక్షలో డాక్టర్ ద్వానాశాస్త్రికి గారికి రాగరాగిణి కళానిధి బిరుదు ప్రధానోత్సవం 19 జనవరి 2012న శ్రీ త్యాగరాయగానసభలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ విచ్చేశారు. తెలుగులో ద్వానా శాస్త్రి గారు మంచి విమర్శకుల్ని ఇటువంటి వారు తెలుగు సాహిత్యానికి ఎంతో అవసరమని శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అన్నారు. సాహిత్యంలో అనేక ప్రక్రియలను సృపశించిన స్పృశించిన గొప్ప వ్యక్తి అన్నారు. తెలుగు మాధ్యమంలో ఎంతో మంది ఐఎఎస్, ఐపిఎస్, లో శిక్షణను ఇచ్చి తీర్చిదిద్దిన వ్యక్తి ద్వానాశాస్త్రి అని అన్నారు.

తెలుగు సాహితీ లోకంలో ఒక అపూర్వం! ఒక అద్భుతం!



తెలుగు సాహితీ లోకంలో ఒక అపూర్వం! ఒక అద్భుతం! సాహితీ సవ్యసాచి డా. ద్వానా శాస్త్రి గారిచే తెలుగు భాషా సాహిత్యాలపై 12 గంటలపాటు నిర్విరామ ప్రసంగధార....

తెలుగు భాషా సాహిత్యాలపై 12 గంటలపాటు నిర్విరామ ప్రసంగధార

ఇదొక సరికొత్త రికార్డు!!!





ఆహ్వనం

తెలుగు సాహితీ లోకంలో ఒక అపూర్వం! ఒక అద్భుతం!



సాహితీ సవ్యసాచి  డా. ద్వానా శాస్త్రి గారిచే
తెలుగు భాషా సాహిత్యాలపై 12 గంటలపాటు నిర్విరామ ప్రసంగధార



25-08-2013. ఆదివారం, ఉ:8గం. నుంచి రాత్రి 8 గంటల వరకు
కళా సుబ్బారావు కళా వేదిక, త్యాగరాయగాన సభ.